బెజ‌వాడ‌లో భార్య బాధితుల సంఘం స‌మావేశం

-

విజయవాడలో భార్యా బాధితుల సంఘం సమావేశం అయింది. అన్ని చట్టాలు భార్యలకు అనుకూలంగానే ఉన్నాయని, భార్యల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని భార్యా బాధితుల సంఘం ఆరోపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆలిండియా భార్యా బాధితుల సంఘం ఏర్పాటు చేసుకున్నామని భార్యా బాధితుల సంఘం వెల్లడించింది.

ఈ సంఘాన్ని ప్రత్యేక రాజకీయ పార్టీగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో హైదరాబాద్‌ లేదా బెజవాడలో భార్యాబాధితులతో 1కే రన్‌ నిర్వహించాలని అనుకుంటున్నారు. కొన్ని చట్టాలను అనకూలంగా చేసుకుని భార్యలు తమ భర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. సెక్షన్‌ 498 కేసు ఉన్నా ఏడాది తర్వాత రెండో వివాహానికి అనుమతి ఇవ్వాలని.. మెయింటెన్స్‌, డొమెస్టిక్‌ వయలెన్స్‌ను చట్టం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news