చాలామందికి ఎన్నో సాధించాలనే కోరిక ఉంటుంది. కాకపోతే వాటిని ఎన్నో కారణాల వలన సాధించలేకపోతారు. ఎప్పుడైనా విజయం సాధించాలి అని అనుకుంటే జీవితంలో ఎన్నో మార్పులను చేసుకోవాలి. వాటిని చిన్నచిన్న అలవాట్లతో ప్రారంభించాలి. ఇలా చేయడం వలన విజయాన్ని సాధించవచ్చు. నిజానికి విజయం సాధించాలనుకునేవారు ఎటువంటి అదృష్టం పై ఆధారపడరు. అంతేకాకుండా మోటివేషన్ కోసం ఎదురుచూడరు, దానికి బదులుగా మంచి రొటీన్ ను పాటిస్తూ ప్రతిరోజు దానికి సంబంధించి కష్టపడుతారు.
దేన్నైనా సాధించాలి అని అనుకుంటే ముఖ్యంగా దాని గురించి సరైన ఆలోచన ఉండాలి. ఏం సాధించాలని అనుకుంటున్నారు అనే దానిని నిర్ణయించుకోవడం ఎంతో అవసరం. చాలా మంది సరైన లక్ష్యం లేకపోవడం వలన దేనిని కూడా సాధించలేరు. కొంతమంది ఎంతో బిజీగా ఉంటారు మరియు వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం వలన లైఫ్ ను బ్యాలెన్స్ చేయలేకపోతారు, దీంతో రోజు చేసే వర్క్ కాకుండా మిగిలిన టాస్క్స్ ను కంప్లీట్ చేయలేరు. ఈ విధంగా ఇతర లక్ష్యాలను చేరుకోలేరు.
ఎదగాలి అనే మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి అవసరమే. ముఖ్యంగా విజయాన్ని సాధించాలి అని అనుకుంటే ప్రతిరోజు కష్టపడాలి. అంతేకాకుండా ఎన్నో రకాల కొత్త స్కిల్స్ ను నేర్చుకోవాలి. ఈ విధంగా జీవితంలో ఎదుగుదల ఉంటుంది. దీంతో విజయాన్ని సాధించగలరు. కొంతమందికి ఇతరుల నుండి నేర్చుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇతరులు చెప్పిన వాటిని మార్చుకోవడానికి త్వరగా ఒప్పుకోరు. ఎప్పుడైతే ఇతరుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని మార్పులు చేసుకుంటారో అప్పుడే దేన్నైనా సాధించగలరు. కనుక మనకంటే చిన్న వారు చెప్పినాసరే దాన్ని అర్థం చేసుకుని తగిన మార్పులు చేసుకోవాలి. ఇలా చేయడం వలన జీవితంలో లక్ష్యాలను సాధించవచ్చు.