ఇంటర్ లో కీలక మార్పులకు సిద్ధం అవుతుంది. ప్రధానంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించనున్నారు. రెండో ఏడాది ఇంటర్ మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే ఇంటర్ సిలబస్ లో కూడా మార్పులు జరగబోతున్నాయి.
ఈ విషయం పై తాజాగా ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్లా మాట్లాడుతూ… తల్లిదండ్రులు.. విద్యార్థులు నిపుణులు నుంచి వచ్చిన సూచనలుతో మార్పులు చేస్తున్నామన్నారు. పబ్లిక్ డొమైన్ లో ప్రజల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటాం. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తున్నారు. ఇంటర్నల్ గా కాలేజీలో ఈ పరీక్షలు జరుగుతాయి. కొన్ని రాష్ట్రాలు కేవలం రెండో ఏడాది మార్కులను పరిగణనలోకి తీసుకుంటానాయన్నారు. అందుకే జాతీయ పరీక్షల అవసరాలుకు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నం అని కృతికా శుక్లా అన్నారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి NCERT సిలబస్ ప్రవేశపెడుతున్నామన్నారు. నీట్ జీ సిలబస్ కోసం ప్రస్తుతం అమలులో ఉన్న సిలబస్ లో మార్పులు చేస్తామన్నారు.