ప్రజల పక్షాన పోరాడే గొంతు ఆపేందుకే కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారు అని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. అడ్డంగా 50 లక్షలతో కెమెరా ముందు దొరికి జైలు కు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి,ఎలాగైనా కేటీఆర్ ని జైలులో వేయాలి అనే ప్రయత్నాలు తప్ప, ఎక్కడ అవినీతి జరగలేదు. కేటీఆర్ పై అక్రమ కేసులతో బీ అర్ ఎస్ పార్టీని భయపెట్టలి అనుకుంటే అది రేవంత్ రెడ్డి మూర్ఖత్వమే,ఉద్యమంలోనే యెన్నో ఆటుపోట్లు ఎదురుకొని ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసిఆర్ సైనికులం మేము.
రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు గురించి ఆలోచించడం మానేసి,ఆరు అక్రమ కేసుల గురించి ఆలోచిస్తున్నారు. హైదారాబాద్ విశ్వ నగరాన్ని ప్రపంచమే అబ్బురపడేలా చేసిన నాయకుడు కేటీఆర్. ప్రజల సమస్యల పైన పోరాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రెస్ లో అసలు ఎక్కడ అవినీతి జరగలేదు,హైదారాబాద్ ఖ్యాతి నీ ప్రపంచానికి తెలిసేలా చేసిన నాయకుడు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసిన, బీఅర్ఎస్ పార్టీ ప్రతి పక్షంగా ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటుంది. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వెంటాడుతూనే ఉంటుంది అని తాటికొండ రాజయ్య చెప్పారు.