గతంలో చీకటి జీవో లు ఇచ్చి పాలించారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మీ సొంత నియోజకవర్గాలకు నిధులు తీసుకువెళ్ళి.. దోచుకొని రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారు అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. రైతులు వరి వేస్తే ఉరి అని కేసిఆర్ అంటే.. ధాన్యం కు బోనస్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నీ లొట్ట పీచు సీఎం అంటావా కేటీఆర్. మీ హాయంలో పరిగి ప్రాంతాన్ని విస్మరించారు. మీరు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. మేము రేషన్ కార్డుల తో పాటు.. సన్న బియ్యం పేదలకు ఇస్తాం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS వార్డు మెంబర్లు కూడా గెలవరు. అన్నింటిలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. మీరు దోషులు అయితే లోపలికి వెళ్తారు. నిర్దోషులు అయితే బయటకి వస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తే.. కేటీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు బయట తిరగనివ్వరు అని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.