నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వాస్తవానికి ఇవాళ అనంతపురం శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి గుడి సమీపంలో జరగాల్సింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ హాజరవుతారని ప్రచారం జరిగింది. అయితే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినట్టు సమాచారం.
డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కొల్లి బాబీ (కే.ఎస్.రవీంద్ర) తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. బాలయ్య సినిమాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి ఏపీలో ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. కానీ తెలంగాణలో మాత్రం నిర్మాతలు కోరలేదని సమాచారం.