ఫార్ములా ఈ రేసు లో నిధుల దుర్వినియోగం చేశారనే అభియోగాల నేపథ్యంలో విచారణకు హజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కి ఏసీబీ అధికారులు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మరికొద్ది సేపట్లో బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు.
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారని పుకార్లు వినిపిస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు అవుతోన్న తరుణంలో నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి హరీశ్ రావు ను పోలీసులు బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్ చేశారు