చాణిక్యుడు కొన్ని ప్రదేశాలలో ఉండడం వలన ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు అని చాణక్య నీతి లో చెప్పడం జరిగింది, అంటే ఒక ప్రదేశంలో ఒక మనిషి ఉండడంతో ఎప్పటికీ ఎదుగుదల ఉండదని మరియు వృద్ధి చెందలేరు అని చెప్పాడు. ముఖ్యంగా జీవితమంతా పేదరికంలోనే గడవాల్సి వస్తుంది అని పేర్కొన్నాడు. ఏ ప్రదేశంలో అయితే పండితులు లేక బ్రాహ్మణులు ఉండరో అక్కడ ఉండే ప్రజలు మానసికంగా వెనుకబడి ఉంటారు. ఈ విధంగా ఎలాంటి వృద్ధి చెందలేరు.
వ్యాపారులు లేని ప్రదేశంలో ఉండడం వలన కూడా జీవితంలో విజయాన్ని సాధించలేరు అని చాణక్యుడు చెప్పడం జరిగింది. వ్యాపారంలో ఎన్నో కీలక విషయాలను నేర్చుకోవచ్చు మరియు అభివృద్ధిని పొందాలి అంటే వ్యాపారం చాలా ముఖ్యం. అయితే చాణక్య ప్రకారం ఎక్కడైతే వ్యాపారులు, వ్యాపారస్తులు ఉండరో అక్కడ ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ మెరుగుపడదు. ఈ విధంగా ప్రజలు అందరూ పేదరికంలోనే ఉండాల్సి వస్తుంది. మంచి పాలకులు లేని చోట కూడా విజయం అంత సులువుగా లభించదు.
చాణక్య ప్రకారం ఎలాంటి ప్రాంతాలలో అయితే బలమైన మరియు తెలివైన పాలకులు ఉండరో అక్కడ ఎప్పటికీ అరాచకం, అస్తవ్యస్తం అయి ఉంటుంది. దీంతో వృద్ధి, అభివృద్ధి వంటివి సాధ్యం కావు అని చెప్పాడు. జీవితంలో నీరు ఎంతో అవసరం. చాణక్య ప్రకారం ఎక్కడైతే నది లేక నీటి వనరులు వంటివి ఉండవో అక్కడ జీవితం ఎంతో అస్తవ్యస్తంగా ఉంటుంది మరియు ప్రజలు కూడా అభివృద్ధి చెందలేదు. ఏ ప్రదేశంలో అయితే వైద్యులు లేక వైద్య సదుపాయాలు ఉండవో అక్కడి ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఈ విధంగా జీవితం ఎప్పుడూ కష్టంగా పేదరికంలోనే నడుస్తుంది. కనుక వైద్యులు లేని చోట ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు మరియు దేన్నీ సాధించలేరు అని చాణక్య చెప్పాడు.