తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తన కుటుంబంతో కలిసి తిరుమలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన.. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ఆయన తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన రోజు ధనుర్మాస ఏకాదశి అని, తెలంగాణ ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు.