తిరుపతిలో ఇటీవల తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులను, గాయపడ్డ బాధితులకు రేపటి నుంచి టీటీడీ పరిహారం అందించనుంది. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.25లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు స్వల్పంగా గాయాలైన వారికి రూ.2లక్షలు ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలోనే తిరుపతిలో మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. చిరుత దాడి ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. టీటీడీ లో పని చేసే ఉద్యోగి ముని పై చిరుత దాడి చేసింది. తిరుపతి సైన్స్ సెంటర్ వద్ద ఉన్నట్టుండి చిరుత బైకు పై వెళ్తున్న ముని పై దాడికి దిగింది. అయితే స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో వెంటనే చిరుత అతడ్నీ వదిలి పరుగులు పెట్టింది. తిరుపతిలో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏవైపు నుంచి పులి వచ్చి దాడి చేస్తోందనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నట్టు పేర్కొంటున్నారు.