ఐటీ తరువాత గ్రీన్ ఎనర్జీకే చంద్రబాబు ప్రోత్సాహం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ తరువాత గ్రీన్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న సోలార్ పార్కును ఆయన సందర్శించి మాట్లాడారు. గ్రీన్ కో కంపెనీ దేశ వ్యాప్తంగా లక్షన్నర కోట్ల పెట్టుబడులు పెడుతుందని తెలిపారు. 2,800 ఎకరాల్లోని ఈ ప్రాజెక్టు దేశంలో మరో చోట ఎక్కడ లేదని తెలిపారు. దీంతో లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. భవిష్యత్ లో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రం కానుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.

అందుకే గ్రీన్ కో ప్రతినిధులు సరైన ప్రణాళికతో రాగానే అనుమతులు ఇచ్చారని వివరించారు. కర్నూలు, నంధ్యాల జిల్లాలలో విస్తరించిన పిన్నాపురం ప్రాజెక్టుకు 2,800 ఎకరాలు ఇవ్వగా.. కొంత భూమి పై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదం వచ్చిందని పేర్కొన్నారు. దీనిని పరిష్కరించాలని కేంద్రాన్ని విన్నవించామని తెలిపారు. ఏపీలో గ్రీన్ కో రూ.35వేల కోట్లు పెట్టుబడులు పెడుతోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news