కొత్త మద్యం కంపెనీలకు గేట్స్ ఓపెన్ చేసిన రేవంత్ సర్కార్..!

-

కొత్త మద్యం కంపెనీలకు గేట్స్ ఓపెన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.  కంపెనీల ఒత్తిడి కి తలొగ్గేది లేదని, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరల ను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

CM Revanth Reddy

కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని అప్రమత్తం చేశారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లకు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, ఆ కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news