బండి సంజయ్ వస్తున్నారని రాత్రికిరాత్రే బీటీ రోడ్డు వేశారు.. ఎక్కడంటే?

-

మొన్నటివరకు గతుకుల రహదారిలో ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులకు ఒక్కసారిగా రిలీఫ్ లభించింది. కేంద్రమంత్రి బండి సంజయ్ వస్తున్నారని తెలిసి అధికారులు రాత్రికి రాత్రే బీటీ రోడ్డు వేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ దోస్తానా మాములుగా లేదుగా? అని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది.

శుక్రవారం కరీంనగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనుల పరిశీలన కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వస్తున్నారని సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు మట్టి రోడ్డు స్థానంలో రాత్రికి రాత్రే బీటీ రోడ్డు వేసినట్లు సమాచారం. తీగలగుట్టపల్లి ROB నిర్మాణంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఓవర్ బ్రిడ్జి సమీపంలో తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు పూర్తిగా చెడిపోయి గుంతలతో వాహనదారులు గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వస్తున్నారని గురువారం రాత్రి 9 గంటలకు అపోలో ఆస్పత్రి నుండి అమ్మగుడి వరకు రాత్రికి రాత్రే రోడ్డు వేశారు. ఇన్నిరోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రోడ్డు గురించి గుర్తుకురాలేదా? అని గులాబీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news