తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది – జేసీ ప్రభాకర్‌

-

వైసీపీ మాజీ మంత్రి రోజాకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తిరుమల టికెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్నది నిజం కాదా..? అంటూ ఆరోపణలు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. దర్శనానికి వెళ్లిన ప్రతి సారి వందలాది మందిని తీసుకెళ్తున్నావ్..అంటూ రోజాపై మండిపడ్డారు జెసి ప్రభాకర్ రెడ్డి. రోజా మీద చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి… నోరు అదుపులో పెట్టుకోవాలని రోజాకు జేసీ వార్నింగ్ ఇచ్చారు.

JC Prabhakar Reddy’s warning to former YCP minister Roja

చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ తెలుసు అన్నారు. మీ మంచితనం అందరికీ తెలుసని… తాడిపత్రిలోనే కార్యకర్తలప్తె 890 కేసులున్నాయని ఆగ్రహించారు. యువగళం ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారని నిప్పులు చెరిగారు. టోకెన్ల దందాప్తె రోజా ప్తె విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి ఘటనలో పూర్తి స్థాయి విచారణ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news