చదువుకునేటప్పుడు ఏ సమస్యా రాకూడదంటే.. విద్యార్థులు ఈ టెక్నీక్స్ ని ఫాలో అవ్వడం మంచిది..!

-

చదువుకునేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా విద్యార్థులు ఈ టెక్నిక్స్ ని ఫాలో అవ్వడం ఎంతో మేలు. ఎప్పుడైనా చదవాలనుకున్నప్పుడు అదే పనిగా పుస్తకాలు ముందు కూర్చోకూడదు. ప్రతి 25 నుండి 30 నిమిషాల వరకు చదివిన తర్వాత ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవడం ఎంతో అవసరం. ఇలా చేయడం వలన ఎక్కువ ఏకాగ్రత ఉంటుంది మరియు మైండ్ కూడా ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది. ఈ విధంగా చదివినదంతా గుర్తు కూడా ఉంటుంది.

ఏ పని చేసిన ఏదైతే ముఖ్యమైనదో మరియు అవసరమైనదో దాన్ని ముందుగా చేయాలి, అంటే మీరు చదువుకునే సబ్జెక్ట్స్ లో కూడా దేన్ని నేర్చుకోవడం ఎంతో అవసరమో గుర్తించాలి. కష్టమైన సబ్జెక్టు ను ముందుగా ఎంపిక చేసుకుని దానిని పూర్తి చేయాలి. ఇలా ఒక ప్రణాళిక తయారు చేసుకుని చదివితే ఎంతో మార్పును గమనిస్తారు. మీ ఏకాగ్రత అనేది చదివే ప్రదేశం పై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతిసారి ఒకే ప్రదేశంలో కూర్చుని చదవడం వలన మోటివేషన్ ఎక్కువగా ఉండదు. కనుక మీరు చదువుకునే ప్రదేశాన్ని కూడా మార్చి మరింత మోటివేషన్ ను పొందండి.

విద్యార్థులు పరీక్షలు ముందు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు, దాని వలన చదివినది గుర్తు కూడా ఉండదు. ఇలాంటి సమయంలో ఒత్తిడి మరియు ఆందోళన వంటి సమస్యలను తగ్గించుకోవడానికి డీప్ బ్రీతింగ్ లేక మెడిటేషన్ వంటివి చేయడం ఎంతో అవసరం. ఇలా చేస్తే మైండ్ ఎంతో ప్రశాంతంగా మరియు యాక్టివ్ గా పని చేస్తుంది. కేవలం మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా కూడా కొన్ని వ్యాయామాలను చేయాలి. వ్యాయామాలు చేయడంతో రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉండవచ్చు. పైగా ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు వ్యాయామాలతో కూడా తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news