కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండల కేంద్రంలో రాత్రి 3 గంటల ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని పరిషత్ కార్యాలయం ఎదుట గల ఎస్బీఐ ఏటీఎంలో కారులో వచ్చిన పలువురు దుండుగులు గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను లాక్‌ను కట్ చేశారు. అందులోని డబ్బును ఎత్తుకెళ్లారు.ఎస్బీఐ అధికారులు వచ్చి చెక్ చేసి చెబితే గానీ అందులో ఎంత డబ్బు పోయిందో తెలియదని పోలీసులు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దొంగతనం చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. చోరీకి వివరాలను డీఎస్పీ సత్యనారాయణ గౌడ్ వెల్లడించగా.. ఆయన వెంట రూరల్ సీఐ రాజశేఖర్, పిట్లం ఎస్సై రాజు, నిజంసాగర్ శివకుమార్, వివిధ మండలాల పీఎస్‌ల ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.