కౌశిక్ రెడ్డికి గేమ్ చేంజర్ ఎఫెక్ఠ్ పడింది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ త్రీ టౌన్ పీఎస్‌లో మరో ఫిర్యాదు అయింది. గేమ్ ఛేంజర్ టికెట్ల ధరలను పెంచడంతో సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారట.
అయితే… సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలతో కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పీఏ ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆర్డీవోతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మరో 2 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఇక అటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికు ఘోర అవమానం చోటు చేసుకుంది. గాడిదకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోటో కట్టి ఊరేగించారు కొంత మంది నేతలు.