ఉపాధి హామీ సభ్యులకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని ప్రకటించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకం లో సభ్యులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు అర్హులు అవుతారన్నారు. సెంట్ భూమి లేని వారీకి వర్తిస్తుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన స్పష్టత ప్రభుత్వం వద్ద వుందన్నారు. అధికారులు ఇందిరమ్మ కమిటీ లు సమన్వయం తో పని చేయాలని కోరారు.
గ్రామాల్లో గ్రామసభ డయాస్ ఏర్పాటు చేసి చర్చించాలన్నారు. గ్రామాల్లో ముడు చోట్ల ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయాలని భట్టి వివరించారు. ప్రజా సంక్షేమం కోసం దేశం లో ఎక్కడ కూడా తెలంగాణ లో వున్నటువంటి వంటి పథకాలు లేవన్నారు. రైతు రుణ మాది, ధాన్యం బోనస్ చారిత్రాత్మక మైన పథకాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని తెలిపారు. 45 వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అంటూ వ్యాఖ్యానించారు. రైతు భరోసా కు 19000 కోట్ల రూపాయలు అని… ఆత్మీయ భరోసా కు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి న పరిస్థితి అని పేర్కొన్నారు.