రజిని కాంత్ జైలర్ 2 టీజర్ రిలీజ్.. అదిరిపోయే ఎలివేషన్స్..!

-

సూపర్ స్టార్ రజినీకాంత్ 70 ఏళ్లు దాటినా ఇంకా సినిమాలు చేస్తూ.. తన అభిమానులను మెప్పిస్తున్నారు. రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్వకత్వంలో జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన విషయం విధితమే. జైలర్ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాప్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ రజినీకాంత్ కి ఎలివేషన్స్ ఇస్తూ అదరగొట్టారు. 

తాజాగా జైలర్ 2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లోనే రజినీకాంత్ కి అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వెంగల్ తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో ఉవ్వెత్తున ఉప్పెనలా ఎగిసిపడుతూ తీరం దాటి అల్పపీడనం ఏర్పడి తీరం తుఫాన్ గా మారవచ్చని వాతావరణ శాఖ ప్రకటించిందనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. అనిరుధ్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ సినిమా గురించి చర్చించుకుంటుండగా రజినీకాంత్ కొంత మందిని చంపుతూ లోపలికి వస్తాడు. ఈ సీన్ ఆకట్టుకుంటోంది. జైలర్ టీజర్ లో ఎలివేషన్స్ మామూలుగా లేవు అనే చెప్పవచ్చు. మ్యూజిక్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news