తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ముంబయి హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. దీంతో సుజయ్ పాల్ హైదరాబాద్ సీజేగా నియమితులయ్యారు.
1964 జూన్ 21న జన్మించిన జస్టిస్ సుజయ్ పాల్ బీకాం, ఎంఏ, ఎల్ఎల్ బీ పూర్తి చేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్ పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు సేవలందించిన ఆయన 2011 మే 27న మధ్య ప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసుతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఆయన హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.