హీరో అజిత్ ఎంత సింపుల్‌గా ఉంటారో అంతకుమించిన టాలెంట్ ఆయన సొంతం. కేవలం సినిమాలే కాకుండా ఆయనకు బైక్ రేసింగ్, కారు రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ టైం దొరికినప్పుడల్లా బైక్ లేదా కారులో లాంగ్ డ్రైవ్ వెళ్తుంటారు.ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇదిలాఉండగా, ఇటీవల దుబాయ్‌లో జరిగిన కారు రేసింగులో హీరో అజిత్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ముందుగా అజిత్ పాల్గొనగా ఆయన కారు ప్రమాదానికి గురవ్వగా.. అనంతరం అజిత్ టీమ్ ఈ రేసులో పాల్గొని మూడో స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన అజిత్ టీం మెంబర్స్‌ను ఆయన అభిమానులు,చిత్ర పరిశ్రమకు చెందిన సన్నిహితులు ప్రశంసలతో ముంచెత్తారు. అయితే, అజిత్ మాత్రం..రేసింగ్ పోటీల్లో తనకు సాయం చేసిన సపోర్టింగ్ సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు.వారి సాయం మర్చిపోలేనిదని పేర్కొన్నారు.