తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడుకున్న ఘనత నీది కేటీఆర్ అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నువ్వు మహా డ్రామా రావు అని తెలుసు ప్రజలకు. నీ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. నువ్వు ఒక యువరాజువు అని నీ దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఈ కార్ రేస్ చేశావని ప్రజలందరికీ తెలుసు. FEO ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేది హైదరాబాద్ కి నేనే తీసుకొచ్చాను, దానిని కాపాడాలని ఇది హైదరాబాద్ కి తలమానికం అని, అందుకోసమే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని గొప్పలు, ప్రగల్బాలు పలుకుతున్నావు కేటీఆర్, నిజ నిజాలు వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు.
ఏస్ నెక్స్ట్ జెనరేషన్స్ గ్రీన్కో సంస్థ యాజమాన్యం నీకు అత్యంత దగ్గర మిత్రులు. వారిని కాపాడటానికి సీజన్ 1కి వాగ్దానం చేసిన 90 కోట్ల చెల్లించని కారణంగా.. 30 కోట్లు ఇచ్చి, 60 కోట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్లు నోటీసులు జారీ చేసి, కాంట్రాక్టు రద్దు చేస్తామని చెప్తే, నీ మిత్రులు గ్రీన్ కో ప్రమోటర్స్ ను నీ బాల్య మిత్రులను కాపాడడం కోసం అక్టోబర్ 2023లో హెచ్ఎండిఏ నిధుల నుండి నిధులు ట్రాన్స్ఫర్ చేసి వారిని కాపాడడం జరిగింది. దానికి గ్లోబల్ హైదరాబాదును కాపాడడం కోసమే అని గొప్పలు అంటూ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.