తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..ఇవాళ దర్శనాలకు 10 గంటలకు పైగా పడుతున్నట్లు సమాచారం. ఇక 67115 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే.. 16,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా తిరుమల హుండీ ఆదాయం 4.03 కోట్లుగా నమోదు అయింది.
ఏడు రోజుల్లో 4 లక్షల 75 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
ఇది ఇలా ఉండగా…. తిరుమలలో ఎల్లుండితో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుంది. ఈ నెల 20వ తేదీ దర్శన విధానం పై ఉన్నతాధికారులుతో సమిక్షించనున్నారు ఇఓ శ్యామలరావు. ఈ నెల 20వ తేదీన సర్వదర్శనం టోకెన్లు జారి,విఐపి బ్రేక్ దర్శనాలు,ఆఫ్ లైన్లో శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ రద్దు చేసింది టిటిడి. ఈ నెల 20వ తేదీన సర్వదర్శనం భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతించనుంది టిటిడి పాలక మండలి.