టాలీవుడ్ స్టార్ నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై లో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
అయితే… అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో చైతన్య అక్కడి స్థానికులతో మాట్లాడి.. వారి స్టైల్‌లోనే చేపల పులుసు చేసి పెడతానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం చేపల పులుసు వండి అక్కడివారికి వడ్డించారు. దానికి సంబంధించిన వీడియో మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.