6-6-6 వాకింగ్ రొటీన్ ని ఫాలో అయితే ఎన్ని లాభాలను పొందవచ్చో తెలుసా?

-

ప్రతిరోజు ఉదయాన్నే ఆరు గంటలకు లేక సాయంత్రం ఆరు గంటలకు 60 నిమిషాలు నడవడానికి కేటాయించడం మరియు ఇలా నడిచే ముందు ఆరు నిమిషాలు పాటు కొంచెం వార్మప్ వంటి వ్యాయామం చేయడాన్ని 6-6-6 వాకింగ్ రొటీన్ అంటారు. ఈ విధంగా నడవడం అలవాటు చేసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉదయాన్నే ఆరు గంటలకు వాకింగ్ చేయడం వలన రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చు. అంతేకాకుండా ఒత్తిడి తగ్గుతుంది.

అదే విధంగా సాయంత్రం పూట కూడా 6 గంటలకు నడవడం వలన మానసిక సమస్యలను తొలగించవచ్చు. సాయంత్రం సమయంలో నడవడం వలన మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాక జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. బీపీ వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సాయంత్రం పూట నడవడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా నడిచే ముందు ఆరు నిమిషాలు పాటు వార్మప్ చేయడం వలన శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఈ విధంగా కండరాలు దృఢంగా మారతాయి మరియు శరీరం ఎంతో ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. ఇలా 60 నిమిషాల పాటు నడిచి శరీరాన్ని ఆరు నిమిషాల పాటు కూల్ డౌన్ చేయడం వలన శరీరం ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది.

ఈ విధంగా శరీరం నుండి టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. ప్రతిరోజు నడవడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఇలా చేయడం వలన జీవితకాలం పెరుగుతుంది. నడవడం వలన గుండె ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. ముఖ్యం గా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా నడవడాన్ని అలవాటు చేసుకోండి. వార్మప్ కూడా ఈ 6-6-6 వాకింగ్ రొటీన్ లో
భాగంగా ఉండడం వలన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. అకస్మాత్తుగా చాలా మందికి గుండెపోటులు వస్తున్నాయి, అటువంటి ప్రమాదాలు రాకుండా తగ్గించడానికి ఈ 6-6-6 వాకింగ్ రొటీన్ ను తప్పకుండా పాటించండి.

Read more RELATED
Recommended to you

Latest news