ఢిల్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టో ను విడుదల చేసారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లి మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు.. మొదటి క్యాబినెట్ లో ఆమోదం చేస్తాం. పేద మహిళలకు గ్యాస్ సిలిండర్ పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తాం. హోలీ, దీపావళి పండుగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం. గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాటు చేస్తాం.
అలాగే దేశ రాజకీయాల్లో రాజకీయ నీతి సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారు. బీజేపీ సంకల్ప పాత్రతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుంది. బీజేపీ చెప్పింది చేస్తుంది, చెప్పనిది కూడా చేసి చూపిస్తుంది . మోడీ గ్యారంటీ.. అమలయ్యే గ్యారంటీ. 2014 లో 500 హామిలిస్తే, 499 అమలు చేశాం. 2019 లో 235 హామీలిస్తే, 225 అమలు చేశాం.. మిగతా హామీలు ప్రాసెస్ లో ఉన్నాయి.