ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ పై విచారణకు స్పెషల్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, విజిలెన్స్ డిజి హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్ పై ఉన్న అభియోగాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగాలపై వీరు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించనున్నారు.
రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణం రాజుని వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్య చేయబోయారనే ఆరోపణలు ఐపీఎస్ అధికారి సునీల్ పై ఉన్నాయి. తనని చంపడానికి వైసిపి పెద్దలు ప్రయత్నించారని, ఆ పని సునీల్ చేయడానికి ప్రయత్నించి చివరకు విఫలమయ్యారని రఘురామకృష్ణం రాజు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.