విశాఖ ఉక్కుకు కేంద్ర సాయం ఓ చారిత్రక ఘట్టం అని అన్నారు సీఎం చంద్రబాబు. విశాఖ ఉక్కుకు కేంద్రం ప్రకటించిన సాయంపై మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ నిర్వాహనకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వమే ఆదుకుందని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని.. ఈ విషయంలో పట్టుదలతో పనిచేశామన్నారు. ఏడు నెలలుగా చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయని తెలిపారు చంద్రబాబు. అందరం కలిసి కష్టపడి స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి బాటలో నడిపించి మంచి పేరు తీసుకురావాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
ఉక్కు కర్మాగారానికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర మంత్రి కుమారస్వామి లకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల హృదయాలలో విశాఖ ఉక్కుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ కి మరిన్ని మంచి రోజులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.