సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుతవం ఇచ్చిన ఉత్తర్వులు-నష్టపోతున్న లక్షలాది మంది తెలంగాణ లబ్దిదారులు అంటూ లేఖలో పేర్కొన్నారు  హరీశ్ రావు. రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో ప్రభుత్వం కోతలు పెడుతూ.. పేదప్రజలను మోసం చేయాలని చూడటం దుర్మార్గం అని.. అభయహస్తం మేనిఫెస్టోలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కొందరికే పరిమితం చేసే విధంగా నిబంధనలు రూపొందించి అమలు చేస్తుండటం మోసం చేయడమే అని లేఖలో పేర్కొన్నారు.

క్షేత్ర స్థాయిలో ఎలాంటి అధ్యయనం చేయకుండా.. అర్హులైన వారికి ఎగనామం పెట్టేవిధంగా ఉన్న నిబంధనలను మీ వైఖరినీ బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీశ్ రావు. ద్రవ్యోల్భణం అనుసరించి ఆదాయ పరిమితి పెంచాలన్నారు కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లబ్దిదారుల జాబితా తయారవుతాయని పేర్కొనడం పేద ప్రజల పాలిట శాపంగా మారిందని.. ఎంతో మంది ఈ సర్వేలో పాల్గొనలేదు. పాల్గొన్న వారిలో చాలా మంది వ్యక్తిగత, వృత్తిపరమైన, తదితర వివరాలను పంచుకోవడానికి ఇష్టపడలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news