ఐసీఐసీఐ బ్యాంకు వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న రైతుకు న్యాయం చేయాలంటూ ధర్నా

-

ఆదిలాబాద్లోని ఐసీఐసీఐ బ్యాంకులో ఆత్మహత్య చేసుకున్న రైతు జాదవ్ దేవరావు కుటుంబానికి న్యాయం చేయాలంటూ, బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని శనివారం సాయంత్రం ప్రధాన రహదారిపై బైఠాయించి తోటి రైతులు, బంధువులు ధర్నాకు దిగారు.

బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేదని, బ్యాంకు ఉద్యోగులు తరచూ కాల్స్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని రైతు జాదవ్ దేవరాజు నిన్న మధ్యాహ్నం జిల్లాలోని ఐసీఐసీఐ బ్యాంకు వెళ్లాడు. అక్కడ తనతో తెచ్చుకున్న పురుగుల మందును అందిరి ముందు తాగాడు. గనించిన ఉద్యోగులు వాచ్‌మెన్‌ను పిలవగా.. అతనొచ్చి కూర్చిలో కూర్చోబెట్టిన విజువల్స్ సీసీ టీవీఫుటేజీలో రికార్డు అయ్యాయి. రైతును ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో బ్యాంకు అధికారులపై అతని కుటుంబసభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news