రేషన్ కార్డు దారులకు ఆదాయ పరిమితిని పెంచాలి : హరీశ్ రావు

-

రాష్ట్రంలో చాలా మందికి రేషన్ కార్డులు లేవు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది వరకు రేషన్ కార్డులు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నేటి వరకు వారికి రేషన్ కార్డులు అందలేదు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా? అని ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇటీవల సర్కార్ ప్రకటించింది. దీంతో హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయమేనని..మీ సేవా దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పెరిగిన ద్రవ్యోల్బణం ఆధారంగా రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాం, నిలదీస్తూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడంతో పాటు మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని నిలదీస్తే వారికి జ్ఞానోదయం అయ్యిందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news