అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు టీటీడీ ఛైర్మన్ BR నాయుడు. అయోధ్యలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మెరిసారు. నిన్న రాత్రి సమయంలోనే.. అయోధ్యకు చేరుకున్నారు టీటీడీ ఛైర్మన్ BR నాయుడు. ఈ సందర్భంగా టీటీడీ తరఫున అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు బీఆర్ నాయుడు.
టీటీడీ చరిత్రలోనే వెంకటేశ్వర స్వామి తరఫున తొలిసారి రాములవారికి పట్టువస్త్రాలు తీసుకువచ్చారు టీటీడీ ఛైర్మన్ BR నాయుడు. నిన్న రాత్రి అయోధ్యలో సరయూ నది ఒడ్డున జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ నాయుడు దంపతులు.. ఇవాళ టీటీడీ తరఫున అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు https://t.co/HfPYL2Xyqb pic.twitter.com/zE3DWflCS3
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2025