గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లిలో నిర్వహించిన గిరిజన ఆదివాసీ సమ్మెళనంలో ఆయన పాల్గొన్నారు. గిరిజన ఉత్పత్తులకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని.. వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని మోడీ అనేక పథకాలు తెస్తున్నారన్న వెంకయ్య నాయుడు వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గనిర్దేశం చేయాలన్నారు. తండాలలో అక్షరాస్యత పెంపునకు పెద్దపీట వేయాలన్నారు. గిరిజనులు వారి స్వభాషతో పాటు తెలుగు, ఆంగ్లం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.