తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో.. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువయ్యాయి. అయితే.. తాజాగా తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా కొట్టింది. ఇక ఈ సంఘటనలో నలుగురు భక్తులకు గాయాలు అయ్యాయి.

దీంతో అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్న తరుణంలోనే… మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా కొట్టిందని చెబుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్
తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం
మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా
నలుగురు భక్తులకు గాయాలు.. అశ్విని ఆసుపత్రికి తరలింపు https://t.co/sNYubMfNhx pic.twitter.com/QanxcJ1176
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025