చలికాలంలో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. దాని వలన చర్మం మరియు జుట్టు పొడిబారుతూ ఉంటాయి. అయితే చలికాలంలో ఈ నూనెలను ఉపయోగించడం వలన కురులు ఎంతో అందంగా మరియు ఆరోగ్యంగా మారతాయి. కొబ్బరి నూనెను జుట్టుకు ఉపయోగించడం వలన జుట్టు ఎంతో హైడ్రేటెడ్ గా ఉంటుంది. దాంతో ఎలాంటి పొడిబారడం కనిపించదు. అంతేకాకుండా జుట్టుకి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా సరే ఎంతో మృదువుగా, దృఢంగా మార్చుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి బాదం నూనె కూడా ఎంతో సహాయపడుతుంది. బాదం నూనెలో విటమిన్ ఈ మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బాదం నూనె ను తరచుగా ఉపయోగించడం వలన జుట్టు ఎంతో మెరుస్తూ కనబడుతుంది.
అంతేకాకుండా పొడిబారడం సమస్య తగ్గుతుంది. ఈ విధంగా జుట్టు ఎంతో దృఢంగా మారుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఉండే పొడిబారితనాన్ని తగ్గించడానికి బాదం నూనె ఎంతో సహాయం చేస్తుందనే చెప్పవచ్చు. ఉసిరి నూనెను కూడా చలికాలంలో ఉపయోగించవచ్చు. దీనిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి నూనె జుట్టును దృఢంగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది. దీని వలన జుట్టు కూడా తరచుగా పెరుగుతుంది. ఈ విధంగా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఉసిరి నూనె సహాయపడుతుంది.
ఆముదం జుట్టు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. పొడిబారిపోయిన జుట్టుకు ఆముదాన్ని రాయడం వలన ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఆముదాన్ని మాడు మీద మర్దన చేస్తే కుదుళ్ళు గట్టిపడతాయి. నువ్వుల నూనెలో ఉండే గుణాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో అవసరం. జుట్టుకు నువ్వుల నూనె రాసిన తర్వాత కొంచెం వెచ్చగా అనిపిస్తుంది. చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో నువ్వుల నూనెను ఉపయోగించడం వలన ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు.