తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ధి చెందిన కొమురవెల్లి మల్లన్న దేవాలయం వద్ద ప్రస్తుతం జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో కొమురవెల్లి మల్లన్న ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితులను ప్రజలకు తెలియజేసందుకు చాలా మంది మీడియా, యూట్యూబర్లు అక్కడకు చేరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఓ లేడీ యూట్యూబర్ తన గ్యాంగుతో ఆలయం వద్దకు వెళ్లింది. అక్కడ జనం మధ్యలో వీడియో రికార్డు చేస్తుండగా తోటి భక్తులతో వారికి వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఫలితంగా యూట్యూబర్‌తో వచ్చిన గ్యాంగ్ ఆలయం వద్ద వీరంగం సృష్టించినట్లు సమాచారం.చొక్కాలు చిరిగేలా అక్కడ తోపులాట, కోట్లాట జరిగినట్లు వీడియో విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
కొమురవెల్లి మల్లన్న దేవాలయం వద్ద మహిళా యూట్యూబర్ హల్చల్
మద్యంమత్తులో బూతులతో రెచ్చిపోయి దాడికి పాల్పడ్డ మహిళా యూట్యూబర్ గ్యాంగ్ pic.twitter.com/CoS0DpWFVS
— ChotaNews App (@ChotaNewsApp) January 20, 2025