సొంత జాగా లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్ల పేరిట..!

-

రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు సీఎం రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. సొంత జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. అయితే, సొంత జాగా లేని అర్హులు రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు. అటువంటి వారికి గత ప్రభుత్వం కట్టించి, లబ్దిదారులకు అందజేయని వాటికి కొత్తగా రంగులు వేసి అర్హులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు రేవంత్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దాదాపు లక్షన్నర ఇళ్ల పంపిణీకి అవకాశం ఉండగా..
సొంత జాగా లేని అర్హులకు వాటిని కేటాయించనున్నారు. పేదల కోసం గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని సిద్ధం చేసి ఇందిరమ్మ లబ్దిదారుల కింద అందజేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news