రన్నింగ్ కారులో అకస్మాత్తుగా మంటలు.. ఎక్కడంటే?

-

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జాతీయ రహదారిపై రన్నింగ్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వలిగోండ క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్ వైపు వస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కారును పక్కకు నిలిపి బయటకు పరుగులు తీశారు.

వారు చూస్తుండానే మంటలు పూర్తిగా వ్యాపించి కారు మొత్తం దగ్దం అయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షాట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news