కోల్ కతా వైద్యురాలి అత్యాచారం కేసు.. నిందితుడు కోర్టులో సంచలన ఆరోపణలు

-

డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ పై కోల్ కతా లోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో కీలక నిందితుడు సంజయ్ రాయ్ అని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దారించింది. ఈ మేరకు ఇవాళ అతనికి ఉరి శిక్షను ఖరారు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ తరుణంలోనే ధర్మాసనం నిందితుడిని కోర్టుకు ఏమైనా చెప్పుకునేది ఉందా..? అని ప్రశ్నించగా.. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని పేర్కొన్నాడు.

తనను కావాలనే కేసులో ఇరికించారని కంటతడి పెట్టాడు. నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు తీవ్ర ఒత్తిడి చేశారని కామెంట్ చేశాడు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. తాను రుద్రాక్ష మాల ధరిస్తానని.. ఒకేళ తప్పు చేసి ఉంటే తన రుద్రాక్ష పూసలు కూడా తెగిపోయి ఉండాలన్నాడు. తనకు ఉరి శిక్ష కాకుండా జైలు శిక్షను విధించాలని కోరాడు. మరోవైపు సమాజంలో నమ్మకం నింపాలంటే ఉరిశిక్ష సరైందని సీబీఐ పేర్కొంది. శిక్ష పై కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మధ్యాహ్నం 2.45 గంటలకు తీర్పును వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news