రద్దైన కేటీఆర్ నల్గొండ పర్యటన..!

-

నల్గొండలో రేపు నిర్వహించాలనుకున్న కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించిన విషయం మనకు తెలిసిందే. కానీ ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామన్న బీఆర్ఎస్ నేతలు.. హైకోర్టును ఆశ్రయించారు. గతంలో క్లాక్ టవర్ వేదికగానే ఎన్నో నిరసన కార్యక్రమాలు చేయగా.. ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యంతరాలు ఏంటని బీఆర్ఎస్ నేతల మండిపడ్డారు. పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బీఆర్ఎస్ నేతల ఆగ్రహం వ్యజతం చేసారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తాం అన్నారు.

కానీ రేపటి కేటీఆర్ నల్గొండ పర్యటన రద్దయింది. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించగా.. పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని చెప్పింది హైకోర్టు. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తు ఇవ్వలేమని.. 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదనే వాదనలు విన్న హైకోర్టు.. బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటీషన్ 27కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news