తెలంగాణ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన సీసీటీవీ వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో మహిళను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు.
కర్నూలు నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు…. నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో మహిళను ఢీకొట్టింది. మహిళ రోడ్డు దాటుతుండగా మలుపు తీసుకుంటూ ఢీకొట్టింది బస్సు. ఇక ఈ ప్రమాదంలో బస్సు కింద పడి మహిళ మృతి చెందింది. దీంతో ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. సీసీటీవీ వీడియో వైరల్!
👉నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో మహిళను ఢీకొట్టిన బస్సు.
👉కర్నూలు నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు.
👉ఈ ప్రమాదంలో బస్సు కింద పడి మహిళ మృతి. pic.twitter.com/xjlGxV1ewX— ChotaNews App (@ChotaNewsApp) January 21, 2025