రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ రేవంత్ రెడ్డి మీద జగ్గారెడ్డి పరోక్ష విమర్శలు చేయడం జరిగింది. రివెంజ్ రాజకీయాలు ఎవరు చేసినా వారు పదవులు పోయాక బాధ పడక తప్పదని పేర్కొన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
తెలంగాణలో కక్ష రాజకీయలు నడుస్తున్నాయి.. ఆ కక్ష రాజకీయాలకు నేను వ్యతిరేకం అన్నారు. గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ రాజకీయాలు చేయలేదని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.