16 మంది మావోయిస్టులు మృతి..శభాష్‌ అంటూ అమిత్‌ షా సంచలన ట్వీట్‌ !

-

16 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో..శభాష్‌ అంటూ అమిత్‌ షా సంచలన ట్వీట్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. గిరియాబంద్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఒడిశా రాష్ట్ర కార్యదర్శి చలపతి మృతి చెందాడు. మావోయిస్టు నేత చలపతిపై రూ.కోటి రివార్డ్‌ ఉంది.

Union Home Minister Amit Shah’s tweet on the Chhattisgarh encounter

ఇక ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలోనే.. అమిత్‌ షా పుండు మీద కారం చల్లారు. ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న బలగాలపై ప్రశంసలు గుప్పించారు అమిత్‌షా. ఇది నక్సల్‌ ఫ్రీ భారత్‌లో భాగంగా కీలక ముందడుగు. నక్సలిజం చివరిదశలో ఉందన్నారు అమిత్‌ షా.

Read more RELATED
Recommended to you

Latest news