సరూర్ నగర డాక్టర్స్ కాలనీ లోని అలకానంద ఆసుపత్రిలో ఎలాంటి అనుమతి లేకుండా హాస్పిటల్ నడుపుతున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి జరుగుతోందన్న సమాచారంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా DM & HO వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్వో గీతా,సరూర్ నగర్ పీహెచ్సీ వైద్యురాలు అర్చన , GHMC అధికారులు, సరూర్ నగర్ పోలీసులతో పాటు సిబ్బంది సంఘటనా హాస్పిటల్ కు చేరుకుని తనిఖీలు చేపట్టడం జరిగింది.
అమాయకుల్ని ఆసరాగా చేసుకొని సరూర్ నగర లోని అలకనంద హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళతో కుమ్మక్కయి కిడ్నీ లను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయం బయటికి వెలుగు చూడడం తో మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్ వద్దకు చేరుకుని పోలీసుల సహకారంతో విచారణ చేపట్టడం జరిగింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్స్ ను అంబులెన్స్ లో నలుగురిని గాంధీ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ట్రీట్మెంట్ మధ్యలోనే వదిలిపెట్టారు హాస్పిటల్ వైద్యులు. వీళ్లంతా కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా సమాచారం.