పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ టూర్ వెళ్లిన సీఎం రేవంత్ బృందం ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలతో వరుసగా భేటీ అవుతోంది. ఈ క్రమంలోనే స్కైరూట్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
ఇదిలాఉండగా, బుధవారం మరో కీలక కంపెనీతో తెలంగాణ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ నగరంలో టెక్ సెంటర్ ఏర్పాటుకు HCLతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్ HCL కంపెనీ సీఈవోతో చర్చలు జరిపారు. మంత్రి శ్రీధర్ బాబు సైతం ఇందులో పాల్గొన్నారు. చర్చలు సఫలం కావడంతో సదరు కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది.తాజా ఒప్పందం మేరకు హైటెక్ సిటీలో దాదాపు 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో HCL క్యాంపస్ నిర్మాణం కానుంది.