జనగామలో ఇల్లు రాలేదని అడిగినందుకు కాంగ్రెస్ కార్యకర్తల దాడి..వీడియో వైరల్

-

ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో గందరగోళం నెలకొన్నది. అర్హులను కాదని అనర్హులను ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇదేంటనీ ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జనగామ నియోజకవర్గం వడ్లకొండలో నిర్వహించిన గ్రామసభలో తనకు ఇల్లు రాలేదని అడిగినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వ్యక్తిపై దారుణంగా దాడులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇక బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభను గ్రామస్థులు అడ్డుకున్నారు. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని అధికారులను ప్రజలు నిలదీశారు. దీంతో అధికారులకు,గ్రామస్థుల మధ్య వాగ్వాదం నెలకొంది.
దీంతో కలుగజేసుకున్న పోలీసులు గ్రామస్తులకు సద్ది చెప్పే ప్రయత్నం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news