తిరుమలలో అనుమతి లేకుండా శారదాపీఠం భవనం.. హైకోర్టు కీలక ఆదేశాలు

-

ఈ మధ్య కాలంలో అక్రమ కట్టడాలు కట్టవద్దని అధికారులు చెబుతున్నప్పటికీ కొందరూ మాత్రం తమకేమవుతుంది లే అని లైట్ తీసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్ లను నిర్మిస్తున్నారు. తీరా కూల్చివేసే సమయానికి వస్తే.. కోర్టులకు వెళ్తున్నారు. ఇటీవల అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీలు లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే తిరుమలలోని శారదాపీఠం భవన నిర్మాణం విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆ భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని తెలిపింది. తిరుమలలో ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని పేర్కొంది. శారదాపీఠం తిరుమలలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నప్పటికీ టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది తుమ్మ ఓంకార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. తాజాగా మరోసారి విచారణ జరిగింది. శారదా పీఠం భవనాన్ని సీజ్ చేస్తూ టీటీడీ తీర్మాణం చేసిందని.. పిటిషన్ న్యాయవాది పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని పేర్కొంది ధర్మాసనం. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news