అమ్మాయి తరఫు బంధువులు దాడి చేయగా అవమానంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్ల ఇటిక్యాల గ్రామంలో గురువారం ఆలస్యంా వెలుగుచూసింది.
స్థానికుల కథనం ప్రకారం.. రెండు రోజుల క్రితం ఇటిక్యాల గ్రామంలో కులాంతర వివాహం చేసుకొని ఓ జంట వెళ్లిపోయింది. ఆ జంటకు సాత్విక్ (23) అనే యువకుడు సాయం చేశాడు. ఈ విషయం సీసీ టీవీ ఫుటేజీ ద్వారా గుర్తించిన అమ్మాయి తరఫు బంధువులు కోపంతో సాత్విక్ ఇంటిపై దాడి చేసి, కుటుంబ సభ్యులను అవమాన పరిచారు. దీంతో అవమానంగా భావించిన సాత్విక్ తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమను అవమానపరిచి, తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సాత్విక్ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.