తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనాల కోసం 6 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. దింతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక 62,223 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.
19,704 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.1 కోట్లుగా నమోదు అయింది. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల కానున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్లను నేడు అంటే గురువారం రోజున టీటీడీ విడుదల చేయనుంది.మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.