విశాఖ జువైనల్ హోమ్స్‌లో దారుణం.. బాలికలకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తూ!

-

విశాఖ జువైనల్ హోమ్స్‌లోని బాలికలు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. వసతి గృహం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన బాలికలు తమను వెంటనే బయటకు తీసుకెళ్లాలని గట్టి గట్టిగా కేకలు వేశారు. అనంతరం రోడ్లపైకి వచ్చి ఆత్మహత్యా చేసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఘటన ఏపీలోని విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోమ్స్‌లో గురువారం వెలుగుచూసింది. తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ బాలికలు ఆరోపించారు. తమను వెంటనే బయటికి తీసుకెళ్లాలని వారు కేకలు వేశారు. మమ్మల్ని ఇంటికి పంపించట్లేదంటూ గోడ మీద నుంచి పెంకులు విసిరేసి బూతులు మాట్లాడుతూ రచ్చ రచ్చ చేశారు. దీనిపై స్పందించిన ఏపీ హోంమంత్రి అనిత ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. బాలికల ఫిర్యాదుపై చైల్డ్ రైట్స్ కమిషన్ సైతం విచారణ చేపట్టింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news